ప్రజాలహరి…దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనగనలో బీసీల కులగణన చేయాలని లేకుంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆగస్టు 7న చలో ఢిల్లీ కి సంబంధించిన పోస్టర్, కరపత్రాలను స్థానిక అమరవీరుల స్థూపం వద్ద ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 7న ఢిల్లీలో వేలాదిమందితో కలకటోర్ స్టేడియంలో జాతీయ మహాసభ నిర్వహిస్తామని,8వ తేదీన పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా 60 కోట్ల మంది బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోతుంది.
అందుకే కేంద్ర ప్రభుత్వం పై సమర భేరీ మోగించడానికి 29 రాష్ట్రాల నుండి బీసీల ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయపార్టీలకు చెందిన నాయకులను ఆహ్వానిస్తున్నట్లు ఆయనతెలిపారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.రాజు,బంటు వెంకటేశ్వర్లు,వీరస్వామి,సందేనబోయేన జయమ్మ,గుండెబోయేన నాగేశ్వరరావు,దాసరాజ్ జయారాజ్,బంటు కవిత,చేగొండి మురళి యాదవ్,వజ్జగిరి అంజయ్య,మండలి సావిత్రి,మోషీన్ తదితరులు పాల్గొన్నారు.