ప్రజాలహరి.
తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక, పరిశ్రమల శాఖామాత్యులు, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, శ్రీ.కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు పంపిణి చేసి అనంతరం ఆసుపత్రి ప్రాంగణం లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గతంలో పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరిలిపోయే పరిస్థితి ఉంటే, నేడు వివిధ జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టిస్తూ, ఇక్కడి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఘనత ముమ్మాటికీ కేటీఆర్ గారికే చెందుతుంది అని. హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ ఎంప్లాయిమెంట్ హబ్ గా మారుస్తున్నారని ప్రశంసించారు. తన విధానాలతో ప్రపంచ స్థాయి కంపెనీలను హైదరాబాద్ లో స్థాపించేందుకు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, ఎంపీపీ నూకల సరళ-హనుమంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిట్టిబాబు నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, సీనియర్ నాయకులూ అన్నభిమోజు నాగార్జున చారి, మదార్ బాబా, పాశం నరసింహ రెడ్డి, తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, తెరాస పార్టీ పట్టణ యువజన అద్యక్షులు జావీద్, ఉపాధ్యక్షులు యరమల్ల దినేష్, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, మండల రైతుబంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, రైతు సంఘం జిల్లా మాజీ అద్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, మాజీ మార్కెట్ డైరెక్టర్ పులి జగదీష్, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు, మాజీ ఎంపీపీ ఒగ్గు జానయ్య, స్థానిక కౌన్సిలర్లు, నాయకులూ, ఆసుపత్రి సూపెరిండేంట్ శ్రీనివాస్ సమరద్, తదితరులు పాల్గొన్నారు.