<>ప్రజలహరి ;”>మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పట్టణంలోని వార్డులలో ప్రస్తుత వర్షాకాల సీజన్ లో విషజ్వరాలైయిన టైఫాయిడ్,మలేరియా,డెంగ్యూ విజృంభిస్తున్నాయనీ తక్షణం అధికారులు చర్యలు తీసుకోవాలని బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోతు దశరథ కోరారు.వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక డిప్యూటీ డీఎంహెచ్ఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందాల్సి వస్తోందనీ తద్వారా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.వైద్య సిబ్బంది ద్వారా మిర్యాలగూడ పట్టణంతోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్య నివారణ చర్యలు చేపట్టడంతో పాటు శుద్ధి జలాలు సరఫరా అయ్యేలా వైద్య సిబ్బంది ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిల్వ ఉన్న నీటి నిలువలను తొలగించడంతో పాటు దోమల వ్యాప్తిని నివారించాలని, మంచినీటి సరఫరా చేసే ట్యాంకులను వారానికి ఒకసారి బ్లీచింగ్ పౌడర్ ద్వారా శుభ్రం చేయించాలని, వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి జ్వర పీడితులకు ఉచితంగా మందులు ఇవ్వడంతోపాటు టెస్టులు నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులకు తగిన సూచనలు చేసి పారిశుద్ధ్య నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యాదవ సంఘం డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు చిమట ఎర్రయ్య,చేగొండి మురళి యాదవ్, బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు, కుమ్మరి సంఘం నియోజకవర్గ అధ్యక్షులు వెంకటయ్య మైనార్టీ సంఘం జిల్లా నాయకులు మోసిన్ అలీ తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.