
ప్రజా లహరి : మిర్యాలగూడ మండలం లోని కొత్తగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కట్టిన పన్నుల ద్వారా నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అర్హులైన పేదవారికి అందజేయకుండా రాష్ట్ర ప్రభుత్వం, మిర్యాలగూడ శాసనసభ్యులు భాస్కర్ రావు కాలయాపన చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎంపీటీసీల ఫోరం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జం సాయి తీవ్రంగా ఖండించారు .ప్రజాధనంతో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కంపచెట్లతో మూసుకొని పోయి వెళ్ళేటందుకు దారి లేకుండా, కిటికీలు పగిలి, తలుపులు పగిలిన పేదవారి ఇళ్లల్లో కట్టెలను దాచుకుంటూ, ఆ ఇండ్లు గొర్రెలు ఉండటం కోసం ఉపయోగిస్తున్నారు.ఇకపోతే ఆ డబుల్ బెడ్రూం ఇండ్లలో కరెంట్ వైరింగ్ సరిగా లేదు, స్విచ్ బోర్డులు కూడా లేని పరిస్థితి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పగుళ్లు వచ్చి మందుతాగి పేకాట స్థావరాలుగా నిలిచిపోయాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి,తక్షణమే నల్లమోతు భాస్కర్ రావు ప్రజల ఓట్లతో రెండుసార్లు గద్దెనెక్కి, మిర్యాలగూడలో ఉండటం కోసం ప్రజల పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంతో మీరు భవనం కట్టించుకున్నారే, అదే ఓట్లు వేసిన ప్రజలకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందించాలని ప్రశ్నించారు. తక్షణమే అర్హులైన ప్రతి పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అతిత్వరలో అందించకపోతే మరియు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వీటిని నిర్మించిన కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోకపోతే ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మిర్యాలగూడ మండలం మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.