Ultimate magazine theme for WordPress.

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపు పట్ల స్వట్ల పంపిణీ,హర్షం:-

Post top

ప్రజ్రాలహరి.. భారత రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము గెలుపు పట్ల స్వీట్ల పంపిణీ,హర్షoభారత రాష్ట్రపతిగా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక ఆదివాసి గిరిజన మహిళ భారీ మెజార్టీతో గెలుపొందడం పట్ల కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం రాత్రి స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు స్వీట్లు పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోతు దశరధ నాయక్ యాదవ సంఘం డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు చిమట ఎర్రయ్య చేగొండి మురళియాదవ్ లు మాట్లాడుతూ దేశ అత్యున్నత పదవి ప్రథమ పౌరురాలిగా ఆదివాసీ గిరిజన మహిళ ఎంపిక కావడం గిరిజనులలో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా గిరిజన మహిళకు రాష్ట్రపతి అయ్యే అవకాశం కల్పించిన ప్రధానమంత్రి మోదీ, మద్దతు తెలిపిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. .కార్యక్రమంలో ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు వజ్రగిరి అంజయ్య, మైనార్టీ సంఘం మోసిన్ అలీ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి నీలకంఠం నాయక్, యాదయ్య,జానీ తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.