నల్గొండ :ప్రజాలహరి
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు తొలిదపా అక్రిడిటేశన్ కార్డుల జారీ ప్రక్రియను పూర్తి చేసిన అక్రిడిటేశన్ కమిటి చైర్మన్, నల్గొండ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ను తెలంగాణ స్మాల్ అండ్ మీడియం దిన, మాస పత్రికల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోటగిరి దైవదీనం, రాష్ట్ర అధ్యక్షులు మాతంగి దాస్ లు సన్మానించారు. గురువారం నల్గొండ కలెక్టర్ ఛాంబర్ లో అక్రిడిటేశన్ కమిటి సమావేశం అనంతరం కలెక్టర్ ను శాలువా, బోకేలతో సత్కరించారు. ఈ సందర్బంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోటగిరి దైవదీనం, రాష్ట్ర అధ్యక్షులు మాతంగి దాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అహమ్మద్ అలీలు మాట్లాడుతూ నల్గొండ జిల్లాలోని ప్రధాన పత్రికలతో పాటు సుమారు 70 చిన్న పత్రికలు, మ్యాగజైన్లకు అక్రిడిటేశన్ కార్డులను తొలిదపాలోనే కలెక్టరు రాహూల్ శర్మ, అసిస్టెంట్ డైరెక్టర్ పి. శ్రీనివాస్ లు మంజూరు చేయడం అభినంద నీయమన్నారు. చిన్న పత్రికల పక్షపాతిగా ఉంటూ అక్రిడిటేశన్ కార్డులను జారీ చేశారన్నారు. సంఘం అధ్వర్యంలో కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ డైరెక్టర్ పి శ్రీనివాస్ లను సంఘం గౌరవ అధ్యక్షులు కోటగిరి దైవాదీనం, రాష్ట్ర అధ్యక్షులు దాస్ మాతంగిలు శాలువాలు, పూల బోకేలతో ఘనంగా సత్కరించారు. అనంతరం దైవాదీనం, దాస్ యం లను సైతం కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘం నల్గొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శలు కోటగిరి చంద్ర శేఖర్, మక్సూద్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కొమర్రాజు శ్రీనివాసులు, పైలం వెంకన్న తదితరులు పాల్గొన్నారు
.