Ultimate magazine theme for WordPress.

వైయస్ జగన్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్న కృష్ణ చైతన్య

Post top

ప్రజాలహరి వైయస్ జగన్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్న కృష్ణ చైతన్య.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ నె ట్ చైర్మన్’అద్దంకి నియోజకవర్గం వైయస్సార్ సిపి ఇంచార్జ్ బాచిన కృష్ణ చైతన్య నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పార్టీ ఆదేశానుసారం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నాడు అద్దంకి నియోజకవర్గంలోని ఉపమాంగులూరు, సంజీవ నగర్, ధర్మవరం, కొత్తపల్లి ,ఏల్చూరు ,పాత మూలాయపాలెం ,బల్లికురవ సంతమాగులూరు, మజ్జువారిపాలెం తోపాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను పర్యటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడప గడప కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు నాయకులకు సమస్యలు ఉంటే సత్వరంగా పరిష్కరిస్తూ ఉన్నారు .అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. గ్రామాల వారిగా మండలాల వారీగా వార్డుల వారీగా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నారు స్థానికంగా ఉండే అధికారులతో మృదువుగా మాట్లాడుతూ ప్రజలు నుంచి వచ్చే సమస్యలను వారితో పరిష్కరింప చేస్తున్నాడు .కృష్ణ చైతన్య వ్యవహార శైలి భిన్నంగా ఉండడంతో  నాయకులు కూడా ఆయనతో మమేకమైతున్నారు .ఆయన చేసే సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ అమలుపరుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు కార్యకర్తలను సమన్వయపరుస్తూ ఆవేశాలకు లోన్ కాకుండా వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. కృష్ణ చైతన్య పర్యవేక్షణలో నియోజకవర్గం వైఎస్ఆర్సిపి బలంగా తయారవుతుందని చెప్పడంలోఅతిశక్తి లేదు

post bottom

Leave A Reply

Your email address will not be published.