
ప్రజాలహరి.. మిర్యాలగూడ లో రహదారులు అధ్వానంగా మారినాయి. రహదారుల నిర్మాణంలో మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు కానీ రహదారుల శాఖ అధికారులు కానీ శ్రద్ధ చూపడం లేదు. పట్టణంలో ప్రధానంగా శకుంతల ధియేటర్ మొదలు ఆర్డిఓ కార్యాలయం వరకు సిమెంట్ రోడ్డు మొత్తం గుంతల మాయంగా మారింది. అదేవిధంగా నందిపాడు క్రాస్ రోడ్డు మొదలు పొట్టి శ్రీరాములు బొమ్మ వరకు, మరియు నందిపాడు క్రాస్ రోడ్ నుంచి ఎన్ఎస్పి మెయిన్ కెనాల్ వరకు రహదారులు గుంతలు మాయంగా మారాయి.పట్టణం లో అంతర్గత రోడ్లు పూర్తిగా అధ్వానంగా మారాయి. ఈ ప్రాంతాల్లో రోడ్లు జలమయంగా మారుతున్నాయి. ఇవేగాక కొన్ని వార్డులలో రహదారులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. పాలకవర్గాలు వీటిపై శ్రద్ధ చూపించటం లేదు. హౌసింగ్ బోర్డ్. ఈదలగూడ. తాళ్లగడ్డ తో పాటు మరికొన్ని వీధుల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. సాగర్ రోడ్డు ప్రధానంగా రోడ్డు వెడల్పు చేశారు గాని షాపుల మధ్య గుంతలుగా గుంతలుగా ఉండడంతో షాపులకు వచ్చే ప్రజలు వ్యాపారస్తులు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం కావడంతో మరింత దారుణంగా ఉన్నాయి.