ఆర్.కె.కళా సాంస్కృతిక ఫౌండేషన్ సేవలు అభినందనీయం
మిర్యాలగూడ :
ఆర్.కె.కళా సాంస్కృతిక ఫౌండేషన్ సేవలు అభినందనీయమని మిర్యాలగూడ వాసి , నటుడు, నిర్మాత మూసా అలీఖాన్ ప్రశంసించారు. హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఆదివారం టాలీవుడ్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, మా అసోసియేషన్ ఈసీ మెంబర్ MRC వడ్లపట్ల, ప్రముఖ దర్శకుడు సముద్ర తదితరులతో పాటు మూసా ఆలీఖాన్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మూసా అలీఖాన్ మాట్లాడుతూ ఆర్.కె.కళా సాంస్కృతిక
ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ రంజిత్ కుమార్ కళాకారుల కోసం పరితపిస్తున్న విధానం స్ఫూర్తి దాయకమన్నారు. వారిలోని ప్రతిభను గుర్తించి ప్రముఖుల చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆర్.కె.కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ రంజిత్ కుమార్ ఇతర రాష్ట్రాల లోనూ, విదేశాలలో సైతం ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలను త్వరలోనే నిర్వహించనున్నారన్నారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఫేర్ అవార్డుల లోగోను ప్రముఖులు అందరూ కలసి ఆవిష్కరించారు.
డాక్టర్ రంజిత్ కుమార్ సేవలను గుర్తించి ఎంతో మంది స్పాన్సర్లు సైతం స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయ మన్నారు. అనంతరం అతిథులను డాక్టర్ రంజిత్ కుమార్ ఘనంగా సత్కరించారు. రెండు తెలుగు రాష్ర్టాల నుండి కళాకారులు, కళాభిమానులు తరలివచ్చా
రు.