చేనేత కార్మికులకు దైద రవీందర్ వితరణ:
న
కిరేకల్ లో మూసీ రోడ్డు లో వున్న 40 చేనేతకుటుంబాలకు పది క్వింటాళ్ల చొప్పున బియ్యం, కూరగాయలను టి పి సి సి కార్యదర్శి దైద రవీందర్ పంపిణీ చేశారు.మూసీ రోడ్డులోని పద్మశాలి కాలనిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మగ్గాలలో నీళ్లు చేరి పని ఆగిపోయి పని లేక ఆర్ధికంగా చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెల్సుకున్న దైద రవీందర్ అక్కడికి వెళ్ళి మగ్గాలలోకి వచ్చిన నీళ్లను పరీశీలించి వారికి తక్షణ సాయంగా కోమటిరెడ్డి బ్రదర్స్ స్పూర్తితో ఈ రోజు కాలనీ లోని 40 చేనేత కుటుంబాలకు పది క్వింటాలు చొప్పున బియ్యం, కూరగాయలు తనవంతు సహాయంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రేస్ నాయకులు గార్లపాటి రవీందర్ రెడ్డి , కాంగ్రేస్ పార్టీ కౌన్సిలర్ గాజుల సుకన్య , నరసింహ రెడ్డి , దేవులపల్లి వెంకన్న , భూతుకూరి వెంకట్ రెడ్డి , మొహమ్మద్ సర్వర్ పాష , మైనార్టీ నాయకులు రియాజ్ ఖాన్ , అబ్దుల్ మజీద్ నాయకులు చేనగోని రాజశేఖర్ గౌడ్ , జావాజి ప్రభు కుమార్ , వంటేపాక నక్షత్ , వంటేపాక సతీష్ , చెరుపల్లి సైదులు , పశుపతి , పందిరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.