Ultimate magazine theme for WordPress.

సంకల్పమే విజయానికి తొలి మెట్టు కావాలి : ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ

Post top

ప్రజలహారి.. వచ్చే నెల 7న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఎస్సై, 21న నిర్వహించనున్న పోలీస్ కానిస్టేబుల్ ప్రిలీమ్స్ తో పాటు గ్రూప్-2, 3, 4 వంటి పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్ధులకు తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాదిరి పరీక్ష నిర్వహించినట్టు ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో నిర్వహించిన మోడల్ పరీక్ష విద్యార్థుల విజయానికి సోపానంగా మారనుందని నల్లమోతు సిద్దార్ధ తెలిపారు. ఎన్బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణా తరగతులకు హాజరైన విద్యార్థుల్లో మనోధైర్యం పెరిగిందన్నారు. మోడల్ పరీక్షకు 716 మంది విద్యార్థులు హాజరయ్యారని అన్నారు. కాగా, ఆగస్టు 7న ఎస్సై, 21న పోలీస్ కానిస్టేబుల్ ప్రిలీమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ కు హాజరుకానున్న అభ్యర్థులకు నల్లమోతు సిద్దార్ధ ఆల్ ద బెస్ట్ చెప్పారు. వారి సంకల్పమే విజయానికి తొలి మెట్టు కావాలని ఆకాంక్షించారు. ఎస్సై, కానిస్టేబుల్, గ్రూప్-2, 3, 4 వంటి పోటీ పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థులందరికీ ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటుగా స్టడీమెటీరియల్ పంపిణీ చేసినట్టు నల్లమోతు సిద్దార్ధ తెలిపారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.