ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం..
ప్రజాలహరి:
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఆయన అనుచరులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నకిరేకల్ మెయిన్ సెంటర్ లో టిపిసిసి కార్యదర్శి దైదా రవీందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భాస్కరరావు దిష్టిబొమ్మ దహనం చేశారు .
ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవి ని తృణప్రాయంగా వదిలేసిన చరిత్ర కోమటిరెడ్డి వెంకటరెడ్డిది అనీ,మీరు విమర్శలు చేస్తుంటే దెయ్యాలు వేదాలు చెప్పినట్టుంది అన్నారు.
మిర్యాలగూడ ఎమ్మేల్యే, వారి అనుచరులు వెంటనే క్షమాపణ చెప్పాలని నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.