ప్రజాలహరి…. భారీ వర్షాలకు భద్రాచలం అతలాకుతలమవుతున్నది. .భద్రాచలం నీటిమట్టం 70 అడుగులకు చేరుకుంది భద్రాచలం రామాలయం భద్రాచలం టౌను భద్రాచలం గోదావరి నది తీరం గ్రామాలు నీట మునిగిపోయాయి. కేంద్ర సైన్యము, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు స్థానిక కలెక్టర్ ఇతర శాఖ అధికారులు సహాయక చర్యలు విస్తృతంగా పాల్గొంటున్నారు. ప్రజలను లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలవరం ప్రాజెక్టుకు వచ్చే నీటిమట్టం భద్రాచలం నుంచే వెళ్తుండడంతో ఈ నీటి ప్రవాహం అధికమవుతున్నది. దీనివల్ల శివారు ప్రాంత ప్రజలు గత ఐదు రోజులుగా నానా అవస్థలు పడుతున్నారు. ప్రజలు తమ ఇండ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. సైన్యము జిల్లా పోలీస్ మరియు రెవిన్యూ ఇతర శాఖ అధికారులు విస్తృతంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆపన్నులకు భోజన పదార్థాలు ఇతర సామాగ్రిలను అందిస్తున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.