వరంగల్‌కు బయల్దేరిన సీఎం కేసీఆర్..రేపు కేసీఆర్ ఏరియల్ సర్వే..
ప్రజలహరి:
- ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి వరంగల్‌కు రోడ్డుమార్గంలో బయల్దేరారు. వరంగల్ జిల్లా ముఖద్వారం అయినా పెంబర్తిలో సీఎం కేసీఆర్ ఆగనున్నారు. హస్త కళాఖండాలను సీఎం పరిశీలించనున్నారు. ఇవాళ రాత్రికి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బస చేస్తారు. ఆదివారం ఉదయం వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ ద్వారా గోదావరి నది పరివాహక ప్రాంతంలో వరద పరిస్థితిని కేసీఆర్ పరిశీలించనున్నారు. సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే కడెం నుంచి భధ్రాచలం వరకున్న గోదావరి పరీవాహక ప్రాంతంలో కొనసాగనున్నది. ఈ సర్వేలో సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.