రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు ఈదురుగాలుల నేపథ్యంలో మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు ప్రజలను కోరారు .ముఖ్యంగా ప్రజలు తమ ప్రయాణాలు అత్యవసరంగా ఉంటేనే జాగ్రత్తలతో చేయాలన్నారు.
కూలిపోయే గృహాల ప్రాంతంలో ఉండరాదు అన్నారు. బ్రిడ్జిలు వంతెనలు శిథిల వస్తలో ఉన్న కరెంటు స్తంభాల వద్ద ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా కోరారు అంతేకాకుండా నియోజకవర్గస్థాయి అధికారులు సమన్వయంతో ప్రజల్ని అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు.