Ultimate magazine theme for WordPress.

పట్టణ ప్రగతి పరుగులు

Post top

రూ.42 లక్షల నిధులతో కొనుగోలు చేసిన స్వీపింగ్ మెషిన్ ప్రారంభించిన భాస్కర్ రావు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమాన్ని మిర్యాలగూడ పట్టణంలో పరుగులు పెట్టిస్తున్నట్టు శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసినట్టు పేర్కొన్నారు. మిర్యాలగూడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను మంజూరు చేస్తోందన్నారు.


పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రూ.42 లక్షల పట్టణ ప్రగతి ప్రత్యేక నిధులతో కొనుగోలు చేసిన స్వీపింగ్ మెషిన్ ను మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ తో కలిసి శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ప్రారంభించారు. స్వీపింగ్ మెషిన్ ద్వారా రోడ్లపై ఉన్న దుమ్ము, ధూళిని అతివేగంగా శుభ్రపరిచే అవకాశం ఉంటుందని అన్నారు.

హైదరాబాద్ నగరం సహా పలు మున్సిపాలిటీల్లో ఈ యంత్రాలను వినియోగిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.